చిరంజీవి చిలకపలుకులు
అంబపలుకు, జగదంబ పలుకు అంటూ తెగ సోదిపెడితే పాపం చిరంజీవికి మైండ్ తిమ్మిరెక్కింది. ఏం పలికినా పరేషాన్ రా బాబు... కాస్థా సైలెంట్ గా ఉండనివ్వండి మొర్రో అంటూ తెలంగాణ ఏపిసోడ్ లో ఎక్కడికో పోయి దాక్కుంటే ఎట్టకేలకు దొరికిచ్చుకున్నారు. ఇక ఏంచేస్థాడు, ఏదో ఒకటి చెప్పాలి అంటూ ఏదో చెప్పేసి, ఏది చెప్పలేదనకుండా, అసలు ఆయన అనుకుంటున్నదేదో ఎవరికి తెలియకుండా చిలకపలుకులు పలికాడు మెగాస్టార్ చిరంజీవి.
రాష్ట్రం అంతటా తెలంగాణ, సమైక్యాంధ్ర గడబిడ నెలకొందని అన్నారు, సర్లే బాబు అది తెలియందెవరికి... ఇంతకీ మీరేమంటారో చెప్పండి అంటే, నేనమంటాను అధిస్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను అన్నారు. దీంతో వినేవారికి చిర్రెక్కింది. ఇది అందరు చెప్పేదేగా... పైగా అధిష్టానం చెప్పింది వినని వారెవరున్నారు అంటూ ఎదురు ప్రశ్నించకున్నా, ఆ అర్థం వచ్చేలా ఎదుటోళ్లు ముఖం పెట్టేసారు.
దీంతో ఇంకా ఏదో చెప్పాలి అన్నట్టు చిరంజీవి ఓ ఫోజు పెట్టి రాష్ట్రంలో అందరు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధిష్టానం తెలంగాణపై సీరియస్ గా ఆలోచిస్థోంది, త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది, అదే ఫైనల్ ఇంకా చెప్పేందుకు ఏమిలేదంటూ అందరు చెప్పిందే చెప్పి ఇవీ... చిరంజీవి చిలకపలుకులు అంటూ ముగించారు.
visit www.greatway.tv for film news, political news, international news, and many updates

No comments:
Post a Comment